'రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువతకు ఓ వరం..'
రాజీవ్ యువ వికాస పథకం గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఓ వరం లాంటిదని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, దుగ్గొండి : రాజీవ్ యువ వికాస పథకం గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఓ వరం లాంటిదని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గిర్నిబావి జీఆర్బీ ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన జరిగిన రాజీవ్ యువ వికాస పథకం సమావేశానికి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని అన్నారు.
మండల యువతీ, యువకులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగ పరచుకోడానికి అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ దంజ్య నాయక్, జిల్లా యూత్ నాయకులు వేముల ఇంద్రదేవ్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓలిగే నర్సింగ రావు, మండల యూత్ అధ్యక్షుడు కొత్తకొండ రవి వర్మ, డ్యాగం శివాజీ, బండారి ప్రకాష్, గోపి, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.