పని లేని వారికి పని కల్పిస్తారు.. వారికి మాత్రం జీతాలు కరువు..
మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద, మండలంలో వందల మందికి పని కల్పిస్తున్న సిబ్బందికి గత మూడు నెలల నుండి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దిశ, బయ్యారం : మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద, మండలంలో వందల మందికి పని కల్పిస్తున్న సిబ్బందికి గత మూడు నెలల నుండి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పని కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 100 రోజుల పనిని కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ టెక్నికల్ ఆఫీసర్స్, కంప్యూటర్ ఆపరేటర్ లు, మండల ఏపీఓలకు తదితర సిబ్బందికి జనవరి మాసం నుండి నేటి వరకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా పని కల్పించి పనిని ఎప్పటి కప్పుడు మానిటరింగ్ చేయవలసిన అధికారులు, చేతిలో చిల్లి గవ్వ లేక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సిబ్బంది తెలిపారు. జీతాలు లేకుండా జీతం ఎట్లా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ జీతాలు సకాలంలో చెల్లించాలని వేడుకుంటున్నారు.