నా సవాల్‌ను వినయ్ ఎందుకు స్వీకరించలేదు.. నాయిని రాజేందర్ రెడ్డి
తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు, ఎన్నికల్లో అమ్ముడుపోయినట్లుగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రొద్బలంతో అసత్య ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ఉద్ఘటించారు.
దిశ, హనుమకొండ టౌన్ : తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు, ఎన్నికల్లో అమ్ముడుపోయినట్లుగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ప్రొద్బలంతో అసత్య ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ఉద్ఘటించారు. తన పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు భద్రకాళి ఆలయంలో ప్రమాణానికి రావాలని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం భద్రకాళి ఆలయానికి ముందురోజు చెప్పిన విధంగానే ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తన సవాల్‌ను స్వీకరించలేదంటేనే వినయ్‌భాస్కర్ ఉద్దేశం ఏంటో అర్థమవుతోందని అన్నారు. భద్రకాళి అమ్మవారి దయతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలో ఆశీస్సులతో ఈ రోజు నేను పార్టీ బి-ఫారం తీసుకోబోతున్నాను అని అన్నారు. గత 37 సంవత్సరాలుగా నిస్వార్ధంగా పార్టీకి సేవ చేస్తూ వచ్చానని అన్నారు. అందుకే తన కష్టాన్ని అర్ధం చేసుకొని ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం దక్కినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఎక్కడ నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ వస్తదో అని ప్రతిపక్ష పార్టీలకు భయం పట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గన్నారపు సంగీత్ కుమార్, సమద్, మాడిశెట్టి రాజ్ కుమార్, జి. శివ ప్రసాద్, సీనియర్ నాయకులు నాయిని లక్ష్మ్యా రెడ్డి, మీర్జా అజీజుల్లా బేగ్, తదితరులు పాల్గొన్నారు.