సరదాగా అలవాటు పడి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు.. : అదనపు కలెక్టర్

మాదకద్రవ్యాల దుర్వినియోగంతో యువత భవిత నిర్వీర్యం

Update: 2024-06-26 11:05 GMT

దిశ, హనుమకొండ టౌన్ : మాదకద్రవ్యాల దుర్వినియోగంతో యువత భవిత నిర్వీర్యం అవుతందని అదనపు కలెక్టర్ రాధిక గుప్త అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా మహిళలు పిల్లలు దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం అదాలత్ ట్రాఫిక్ కూడలిలో నిర్వహించి మత్తు పదార్థాల దుర్వినియోగం పర్యవసనాల పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ రాధిక గుప్త మాట్లాడుతూ నేడు మాదకద్రవ్యాలు చాక్లెట్ బిస్కెట్ రూపంలో పాఠశాల కళాశాల సమీపంలో షాపుల్లో అమ్ముతున్నట్లు ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని వీటిపట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను అప్రమత్తం చేయాలని అన్నారు. దేశ సంపదగా భావించే యువత పార్టీలు పేరుతో సరదాగా మత్తు పదార్థాలను సేవించి వాటికి బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, యువశక్తి ముందు ఏది సాటిరాదని యువత తలచుకుంటే ఉన్నత స్థానాల్లో ఉంటారని, కన్న తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలంటే ఉన్నత విద్య తో పాటు ఉన్నత ఆశయాలతో బ్రతకాలని అన్నారు. అశాశ్విత ఆనందాలకు అలవాటు కన్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చవద్దని సూచించారు.

అడిషనల్ డీసీపీ రవి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నదని, మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీస్ శాఖకు తెలియచేయాలని టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ విభాగం చర్యలు తీసుకుంటారని అన్నారు.

డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ బి సాంబశివ రావు మాట్లాడుతూ..జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జిల్లా యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సుల నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులను ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ మహిళా శిశు దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతి కార్యక్రమంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై నిరంతరం అవగాహన కల్పించాలని సమస్య ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని అన్నారు.

కార్యక్రమంలో డీసీపీ సురేష్, జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్, ఎసిపిలు కొత్త దేవేందర్ రెడ్డి, తిరుమల్ రావు, నంది రాం నాయక్, సీఐలు దుర్గా భవాని, సత్యనారాయణ, డి సురేష్, రవికుమార్, డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ యాకుబ్ పాషా, డెమో వి అశోక్ రెడ్డి, డాక్టర్ ఉమ శ్రీ, డాక్టర్ ప్రహసిత్, డాక్టర్ అహ్మద్, డీపీవో ముంజం రాజు, జెజెబి సభ్యులు మెరుగు సుభాష్, సూపరింటెండెంట్ జి లక్ష్మి కాంత్ రెడ్డి, ఇన్చార్జి డీసీపీవో ఎస్ ప్రవీణ్ కుమార్, హెల్పింగ్ హాండ్స్ సంస్థ కార్యదర్శి రాము, ఎఫ్ఆర్వో రవి క్రిష్ణ, ప్రొఫెసర్ రవి కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు, కాగా కార్యక్రమం అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేసి, మాదకద్రవ్యాల దుర్వినియోగం పై దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.

Similar News