జ్ఞానాంబిక ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన..

మండలం లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ జ్ఞానాంబిక ఫర్టిలైజర్

Update: 2024-06-28 15:55 GMT

దిశ,వర్థన్నపేట : మండలం లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ జ్ఞానాంబిక ఫర్టిలైజర్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. రాయపర్తి మండలం తిర్మాలయపల్లి గ్రామానికి చెందిన కొంత మంది రైతులు ఫర్టిలైజర్ షాపు నుంచి కెఏన్ఏమ్ 1638 వరి విత్తనాలు తీసుకెళ్లారు .దీంతో తీసుకెళ్లిన వరి విత్తనాలను నీటిలో నానబెట్టి మండే కట్టారు.ఈ నేపథ్యంలో మూడు రోజులైనా కట్టిన మండె కట్టినట్టే ఉందని మొలకలు రాలేదని రైతులు ఫర్టిలైజర్ షాపు ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వరంగల్ కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ వరంగల్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్ జ్ఞానాంబిక ఎరువులు, మర్చంట్ దుకాణాన్ని తనిఖీ చేశారు.

రాయపర్తి మండలం రైతులు కెఏన్ఏమ్-1638 వరి నాసిరకంగా మొలకెత్తడంపై ఫిర్యాదుకు చేశారు.ఈ నేపథ్యంలో తదుపరి చర్య తీసుకోవడానికి స్టాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంకురోత్పత్తి పరీక్ష కోసం విత్తన నమూనాను పంపడం జరిగిందన్నారు. ఉన్న ఇతర రైతులతో ఆమె మరింత ఆరా తీశారు. వారు మంచిగా మొలకెత్తిందని, అదే విత్తనాన్ని తదుపరి కొనుగోలు కోసం వచ్చారని చెప్పారు.ఇది హైబ్రిడ్ విత్తనం కాదు, అయితే ఇది అధిక దిగుబడినిచ్చే సత్యమైన లేబుల్‌తో కూడిన నోటిఫైడ్ రకం మాత్రమేనని చెప్పారు. హనుమకొండ జిల్లాకు చెందిన సుమాంజలి సీడ్స్ ప్రైవేట్ సీడ్ ప్రొడ్యూసర్ ద్వారా ఉత్పత్తి చేయబడిందని, అయితే అంకురోత్పత్తి పరీక్ష నివేదిక అందిన వెంటనే విత్తన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు.

Similar News