వనమహోత్సవానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి : కలెక్టర్

వన మహోత్సవంలో భాగంగా ఈనెల 7వ తేదీలోగా జిల్లా

Update: 2024-07-01 14:58 GMT

దిశ,వరంగల్ కలెక్టరేట్ : వన మహోత్సవంలో భాగంగా ఈనెల 7వ తేదీలోగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామూహికంగా మొక్కలు నాటుటకు కొన్ని అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకొని సిద్ధంగా ఉండాలని కలెక్టర్ డా సత్య శారద అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ఛాంబర్ లో వరంగల్ జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం సమర్ధ నిర్వహణ కోసం తగు సూచనలు చేశారు. ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు కెనాల్, చెరువు గట్లు, అటవీ తదితర ప్రాంతాలను శాఖల వారీగా గుర్తించి నర్సరీలలో మొక్కలను అందుబాటులో ఉంచుకోని గుంతలు త్రవ్వి సిద్దంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ కౌసల్యాదేవి జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, జీడబ్ల్యూఎంసీ ఉప కమిషనర్ కృష్ణ రెడ్డి, ఎఫ్ ఆర్ ఓ సదానందం, డీపీఎం రేణుక, డిప్యూటీ డిఆర్డిఓ తదితరులు పాల్గొన్నారు.

Similar News