అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి : మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన

Update: 2024-07-03 15:23 GMT

దిశ,కాటారం : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలను గుర్తించి పథకాలను వర్తింపజేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎవరు ప్రలోభ పెట్టిన అన్హరులకు చోటు ఇవ్వకుండా క్రైటీరియా తీసుకొని అధికారులు పథకాలను అమలు చేయాలని అన్నారు. బుధవారం మహదేవపురం మండల కేంద్రంలో రూ. కోటి 70 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పదవీ విరమణ చేసిన జడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, ఎంపీపీ రాణి బాయి-రామారావు, ఎంపీటీసీలను శ్రీధర్ బాబు శాలువాతో ఘనంగా సన్మానం చేసి మెమెంటోలు బహుకరించారు. ఎంపీటీసీలు తమ పదవీ కాలంలో వివిధ అభివృద్ధి పనులు చేసి ప్రజల మనసులను చూరగొన్నారని ప్రభుత్వం అందించే పథకాలను గ్రామాలలో అరులైన వారికి అందేలా మళ్లీ ఎన్నికలు జరిగేంతవరకు చూడాల్సిన కీలక బాధ్యతలు మీ పైనే ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను జిల్లా మండల స్థాయి అధికారులు నిరుపేదలను మాత్రమే గుర్తించి వారే లబ్ధి పొందేలా చూడాలని మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసు చేస్తే అనర్హులను ఎంపిక చేయవద్దని శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. వనమహోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఈవో విజయలక్ష్మి,డి ఆర్డీఓ పీడీ నరేష్,ఎంపీటీసీలు ఆకుతోట సుధాకర్, రేవెల్లి మమత, చల్ల రమ, మడక తిరుమల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ సర్పంచ్ అయిల్నేని నవీన్ కుమార్, వామన్ రావు, అశోక్ గౌడ్, ఎంపీడీఓ రవీంద్రనాథ్ ఏపిఎం రవీందర్, సీసీ శశికాంత్ పాల్గొన్నారు. కాటారం డి.ఎస్.పి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు అభినవ్ మహేంద్ర కుమార్, కిషోర్ లు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసే ప్రదేశాల్లో డాగ్ డాగ్ స్క్వాడ్ తో ముందుగా పోలీసులు తనిఖీ చేశారు.


Similar News