పేరుకే పెద్ద ఆసుపత్రి.. సమయపాలన పాటించని వైద్యులు

గూడూరు కొత్తగూడ గంగారం మూడు మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న

Update: 2024-07-05 14:48 GMT

దిశ,గూడూరు: గూడూరు కొత్తగూడ గంగారం మూడు మండలాలకు పెద్ద దిక్కుగా ఉన్న గూడూరు ఏరియా ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలు దాటిన వైద్యులు ఆసుపత్రికి రాకపోవడంతో ఉదయం నుంచి వైద్యుల కోసం వేచి చూస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే సమయానికి వైద్యులు ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో అనేక రోగాలకు గురవుతున్న రోగులు ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేరనే నిరాశ ఎదురవుతుంది.

రాత్రి వేళల్లో వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే డాక్టర్లు అందుబాటులో లేక వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది అని ప్రజలు వాపోతున్నారు. గూడూరు ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. రోగులు వచ్చే దావఖాన కు 4 గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. వెంటనే సంబంధిత అధికారులు ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే 100 పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ చేసి రోగులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.


Similar News