పెట్రోల్ బాటిల్‌తో కలెక్టర్ కార్యాలయంలో వికలాంగుడి నిరసన..

బచ్చన్నపేట మండలం అలింపురం గ్రామానికి చెందిన పాకాల రమేష్

Update: 2024-07-08 11:02 GMT

దిశ,జనగామ : బచ్చన్నపేట మండలం అలింపురం గ్రామానికి చెందిన పాకాల రమేష్ కు మూడు సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయాడు. మెడికల్ సర్టిఫికెట్ లో 85 శాతం వికలాంగత్వం ఉన్న గత మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన పెన్షన్ రాలేదని ఈరోజు ప్రజావాణి లో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన రమేష్ తన వెంట పెట్రోల్ బాటిల్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశాడు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది పెట్రోల్ బాటిల్ లాక్కుని బాధితుడిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో బాధితుడు వెనుదిరిగాడు.


Similar News