ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి : జిల్లా కలెక్టర్

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్

Update: 2024-07-05 13:37 GMT

దిశ, జనగామ:ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయం లో ఏర్పాటు చేసిన కార్యాలయాల ను కలెక్టర్ స్వయంగా సందర్శించి పరిశీలించారు.ప్రతి కార్యాలయాలను సందర్శించి పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. కార్యాలయంలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ పనితీరును పరిశీలిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆహ్లాద వాతావరణం కొరకు గాలి వెలుతురు వచ్చే విధంగా కార్యాలయంను ఏర్పాటు చేసుకోవాలని మొక్కలుతో ఉన్న కుండీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సెకండ్ ఫ్లోర్ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అధికారులు పరిశుభ్రతపై ప్రతిరోజు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదురుగా నీటి నిలువ పై రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశిస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని సందర్శించి పాత పేపర్లను తీసివేయాలని, పనిచేయని సామాగ్రిని స్టోర్ రూమ్ కి తరలించాలన్నారు.లిఫ్ట్ మరమ్మతుల కొరకు సంబంధిత కంపెనీ వారికి సమాచారం పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పరిశుభ్రతలో అధికారులందరూ బాధ్యతతో పరిశుభ్రతను చేపట్టాలన్నారు.కలెక్టర్ వెంట ఏవో రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News