నీతి ఆయోగ్ సూచించిన అంశాలను గుత్తి కోయగూడాలకు అందించాలి : జిల్లా కలెక్టర్

నీతి ఆయోగ్ సూచించిన ఆరు అంశాలలను చిట్టచివర ఉన్న గుత్తి

Update: 2024-07-01 13:41 GMT

దిశ,ములుగు ప్రతినిధి: నీతి ఆయోగ్ సూచించిన ఆరు అంశాలలను చిట్టచివర ఉన్న గుత్తి కోయగూడాలకు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ లో భాగంగా సంపూర్ణత అభియాన్ జూలై 4వ తేదీ నుంచి కన్నాయిగూడెం మండలం లో అమలు కోసం సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ రివ్యూ నిర్వహించారు.

వైద్య శాఖకు సంబంధించి ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ హైపర్ టెన్షన్ డయాబెటిస్ టెస్టులు చేయాలని పౌష్టికాహారానికి సంబంధించి గర్భిణులకు సప్లమెంటరీ న్యూట్రిషన్ అందించాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి నేల పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్ రైతులకు అందించాలని మహిళా సంఘాలకు లోన్లు అందించాలని సంబంధించిన అధికారులు వాటి అమలు పర్యవేక్షించి సంపూర్ణ అభియాన్ మూడు నెలల ప్రణాళికను విజయవంతం చేయాలని మండల అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో, మెడికల్ ఆఫీసర్,సీడీపీఓ ,ఏవో ,డీఆర్డీఓ, డిప్యూటీ డీఆర్డిఓ, నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్, బ్లాక్ ఫెలో పాల్గొన్నారు.

Similar News