హనుమకొండలో మెడికోవర్ ఆస్పత్రిని ప్రారంభించనున్న CM రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప

Update: 2024-06-29 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం హోదాలో జిల్లాకు మొదటిసారిగా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ను, ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీంచనున్నారు. హనుమకొండలో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. హనుమకొండలో మెడికోవర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. హన్మకొండ-వరంగల్ జిల్లాల పరిధిలో, గ్రేటర్ వరంగ్ మున్సిపాలిటీ, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2041 ఫైనల్ తదితర అంశాలపై హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు సరేఖ, సీతక్క, ఎమ్మెల్యే, జీడబ్ల్యూఎంసీ, పలువురు అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించనున్నారు. కాగా రేవంత్ రెడ్డి ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యాహ్నం 12: 40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు మధ్యాహ్నం 1. 30 గంటలకు చేరుకోనున్నారు. 

Tags:    

Similar News