Seethakka: ముందుగా గుర్తిస్తే ఎంతటి రోగాన్నైనా జయించవచ్చు.. మంత్రి సీతక్క

ముందుగా గుర్తిస్తే ఎంతటి వ్యాధినైనా(Disease) నయం చేయవచ్చని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క(Women Development And Child Welfare Minister Seethakka) అన్నారు.

Update: 2024-11-24 09:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ముందుగా గుర్తిస్తే ఎంతటి వ్యాధినైనా(Disease) నయం చేయవచ్చని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క(Women Development And Child Welfare Minister Seethakka) అన్నారు. ములుగు(Mulugu) జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానం(Degree College Ground)లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్(Grace Cancer Foundation Hyderabad) సంయుక్తంగా అంగన్వాడీ టీచర్లు(Anganwadi Teachers), ఆయాలు(Nurses), మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్థారణ పరీక్షలు(Free Cancer Screening Tests) చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించ‌డం ద్వారా ఎంత‌టి రోగాన్నైనా జ‌యించ‌వ‌చ్చని తెలిపారు. అలాగే సరైన ఆరోగ్యంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమ‌ని, న‌మ్మిన ప్ర‌జా ప్ర‌భుత్వం ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హిస్తుందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణ‌మే ల‌క్ష్యంగా మ‌హిళా ఉద్యోగుల‌కు, సిబ్బందికి ఆరోగ్య శిబిరాలు నిర్వ‌హిస్తున్నామని సీతక్క తెలియజేశారు. ములుగులోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో రెండు రోజులపాటు ఉచిత క్యాన్సర్ నిర్థారణ పరీక్ష శిబిరాన్ని నిర్వ‌హించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు. ఇక జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని, పరీక్షలు చేయించుకోవాలని సీతక్క సూచించారు.

Tags:    

Similar News