కాళేశ్వరంలో కార్తీక సందడి వీకెండ్ లో పోటెత్తిన భక్తజనం

పవిత్రమైన కార్తీక మాసంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు.

Update: 2024-11-24 15:46 GMT

దిశ, కాటారం : పవిత్రమైన కార్తీక మాసంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక అభిషేకములు, శుభానంద దేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఉసిరిక చెట్టు కింద వత్తులు ముట్టించుకొని వేద పండితులకు కాయపై దీపం పెట్టి దీపదానం చేశారు. శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు చాలా సేపు వేచి ఉన్నారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించారు. సమీప అడవిలో వేద ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు స్వయంగా వంటలు వండుకొని వన భోజనం చేశారు. ప్రధాన దేవాలయం ఆవరణలో ఆదివారం రాత్రి సామూహిక దీపోత్సవం నిర్వహించారు. గ్రామాల్లో పల్లె ప్రజలు షష్టి భోనలు నిర్వహించుకున్నారు.


Similar News