శాయంపేట మండల బీఆర్‌స్‌లో అసంతృప్తి

హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇంకా అసెంబ్లీ పోలింగ్‌కు 11 రోజులు ఉండడంతో ఎన్నికల వాతావరణం రోజు రోజుకి వేడెక్కిపోతుంది.

Update: 2023-11-19 06:16 GMT

దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇంకా అసెంబ్లీ పోలింగ్‌కు 11 రోజులు ఉండడంతో ఎన్నికల వాతావరణం రోజు రోజుకి వేడెక్కిపోతుంది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి మారుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. శాయంపేట మండలంలో ఏ గ్రామాంలో చూసిన ఎన్నికల వాతావరణ స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. ఈ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గతంలో కాంగ్రెస్ ఏం చేసింది. ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతుందని.. ఇంకా బీజేపీ కేంద్ర ప్రభుత్వాల పథకాల గురించి చర్చించుకుంటున్నారు. కానీ భూపాలపల్లిలో ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో మధ్య రసవత్తర పోటీ ఉంటుందని స్పష్టంగా కనబడుతుంది.

ఇమడలేకపోతున్న బీఆర్ఎస్ క్యాడర్

భూపాలపల్లి నియోజకవర్గంలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అనుకుంటున్నారు. కానీ శాయం పేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక ప్రజా ప్రతినిధి వ్యక్తికి ఒక్కరికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తీవ్ర అసహనానికి గురై బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక తప్పని పరిస్థితుల్లో పార్టీ వీడుతున్నారని కొంతమంది బాహాటంగా చర్చించుకుంటున్నారని సమాచారం. మొదటి నుంచి పార్టీలో గండ్ర వెంకట రమణారెడ్డి వెంట ఉంటున్న వారికి కాదనకుండా మధ్యలో వచ్చిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇటీవల పార్టీని వీడుతున్న వారు చర్చించుకుంటున్నారు.

కీలక ప్రజాప్రతినిధికి మండలంలోని ఏదైనా గ్రామంలోని ఏదైనా పని పడితే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజా ప్రతినిధి ఏదైనా విషయంలో సహకరించకపోతే గ్రామంలో ఉన్న ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేస్తాడని, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా అధిష్టానానికి చెప్తాడని సమాచారం. ఇదంతా ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డికి తల నొప్పిగా మారుతుందని తెలుస్తుంది. కానీ ఎమ్మెల్యే గండ్ర మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News