సాంప్రదాయ మీడియా రంగానికి దిశ సీపీఆర్ వంటిది: మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
సాంప్రదాయ మీడియా రంగానికి దిశ సీపీఆర్ వంటిదని నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ అన్నారు
దిశ, నర్సంపేట: సాంప్రదాయ మీడియా రంగానికి దిశ సీపీఆర్ వంటిదని నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ అన్నారు. మూస ధోరణికి చరమగీతం పాడుతూ డిజిటల్ మీడియా గా దూసుకొచ్చిన దిశ మీడియా రంగంలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనతికాలంలోనే మీడియా రంగంలో కొత్త ఒరవడిని దొరకపుచ్చుకున్న దిశ మీడియా సంస్థల పరంగా ముందు వరుసకి చేరుకుంది. నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ మాట్లాడుతూ... దిశ సంస్థ మరింత దినదినాభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ 2025ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యాలయ సూపరెండెంట్ మొయిజ్, దిశ నర్సంపేట ఆర్.సీ ఇంఛార్జి నాంపల్లి, మురళీధర్, ఖానాపురం రిపోర్టర్ శశిధర్, దూగ్గొండి రిపోర్టర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.