డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన దిశ...

ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి సీతక్క దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

Update: 2025-01-02 04:36 GMT

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి సీతక్క దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దిశ దినపత్రిక అతి తక్కువ కాలంలో పాఠకుల ఆదరణ పొందిన పత్రికగా నిలిచిందని, డిజిటల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నారు.

మిగతా పత్రికలు సైతం డిజిటల్ మీడియాలో దిశను అనుసరిస్తున్నాయని, నిజాలను నిర్భయంగా రాస్తూ పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని కొనియాడారు. కొత్త సంవత్సరంలో కూడా దిశ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు దిశ స్టాప్ రిపోర్టర్ గాదె సుమన్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Similar News