దిశ ఎఫెక్ట్.. వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం
జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్ సి హెచ్ లో గర్భిణీ స్త్రీల పై జరుగుతున్న నిర్లక్ష్య వైఖరి పై ‘దిశ’ వాస్తవ కథనాలకు వైద్య శాఖ కమీషనర్ ఆర్.వి. కర్ణన్ ఐఏఎస్ స్పందించి వెంటనే వివరణ కోరుతూ జనగామ డీఎంహెచ్ఓ రవీందర్ గౌడ్ కు ఆదేశాలు జారీచేశారు.
దిశ, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్ సి హెచ్ లో గర్భిణీ స్త్రీల పై జరుగుతున్న నిర్లక్ష్య వైఖరి పై ‘దిశ’ వాస్తవ కథనాలకు వైద్య శాఖ కమీషనర్ ఆర్.వి. కర్ణన్ ఐఏఎస్ స్పందించి వెంటనే వివరణ కోరుతూ జనగామ డీఎంహెచ్ఓ రవీందర్ గౌడ్ కు ఆదేశాలు జారీచేశారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జనగామ డీఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ గౌడ్ మాతా, శిశు ఆరోగ్య కేంద్రం కి వెళ్లి తనిఖీ చేశారు. ఎం సి హెచ్ లోని డాక్టర్లను, సిబ్బందిని పిలచి మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్య విషయంలో డాక్టర్లు సేవ చేసే విధంగా ఉండాలని, హాస్పిటల్ కి వచ్చిన గర్భిణీ స్త్రీలతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బంది సైతం ఎలాంటి సమస్యలు చేయకూడదని సూచించారు. అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రిని తనిఖీ చేయడం పై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.