సంచలనాలతో ప్రజలకు చేరువలో దిశ దినపత్రిక

డైనమిక్‌ లాంటి వార్తలు, విశేషాలతో మీడియా రంగంలో ట్రెండ్‌ సెట్టర్‌గానే కాదు.. సామాజిక అవసరాలు

Update: 2024-12-30 13:25 GMT

దిశ, వరంగల్‌ టౌన్ : డైనమిక్‌ లాంటి వార్తలు, విశేషాలతో మీడియా రంగంలో ట్రెండ్‌ సెట్టర్‌గానే కాదు.. సామాజిక అవసరాలు, సమస్యల పరిష్కారంలో దిశ దినపత్రిక ప్రజలకు పెద్ద దిక్కుగా మారిందని పలువురు వక్తలు ప్రశంసలు కురిపించారు. సంచలనాత్మకమైన కథనాలతో దిశ దినపత్రిక ప్రజలకు రోజురోజుకు చేరువవుతున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దిశ దినపత్రిక రూపొందించిన 2025 సంవత్సరపు క్యాలెండర్‌ను సోమవారం వరంగల్‌ నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దిశ దినపత్రికలో కథనాలను, విశ్లేషణలను వక్తలు అభినందించారు. ప్రజల పక్షాన దిశ దినపత్రిక అక్షర యజ్జం కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు.

వరంగల్‌లో ముఖ్యంగా రైతుల సమస్యలపై దిశ దినపత్రిక అలుపెరుగని పోరాటం సాగిస్తున్నదని అన్నారు. రానున్న రోజుల్లో దిశ దినపత్రిక అక్షర పోరాటంతో సమస్యలు లేని సమాజం సృష్టించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, సిఐలు తుమ్మ గోపి, వెంకటరత్నం, ఎస్ఐలు విఠల్, నవీన్ కుమార్, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి, వ్యాపారులు వీరారావు, లింగారెడ్డి నాగభూషణం, మన అగ్రిటెక్ ఎండి పాశికంటి రమేష్ తదితరులు ఉన్నారు.


Similar News