ఆటో నుంచి జారిపడి…అనంత లోకాలకు..
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
దిశ,నెక్కొండ: ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన కథనం ప్రకారం… వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒర్రె.సహదేవుడు(30 సం"లు) నెక్కొండ మండల కేంద్రంలో క్యాంటీన్ లో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఆటోలో స్వగ్రామానికి వెళుతున్నాడు. అప్పారావుపేట గ్రామ సమీపంలో ఆటో వేగంగా వెళ్లడం తో,ప్రయాణిస్తున్న ఆటో నుండి జారిపడ్డాడు. అదే రోజు సాయంత్రం అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం 4-20 గంటలకు ఎంజీఎం హాస్పిటల్ లో మృతి చెందాడు. మృతుని భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.