నల్ల బ్యాడ్జీలతో కేజీబీవీ ఎదుట ధర్నా..

కేసముద్రం మండల కేజీబీవీ పాఠశాల ఎదుట ఇంచార్జ్ ప్రిన్సిపాల్

Update: 2024-11-27 11:51 GMT

దిశ,కేసముద్రం: కేసముద్రం మండల కేజీబీవీ పాఠశాల ఎదుట ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అరుణ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దశల వారీగా జరిగే పోరాటంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయిస్తూ శ్రమదోపిడికి గురి చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డు మంజూరు చేయాలని ,కేర్ టేకర్ ను నియమించాలని, ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు .


Similar News