బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి..: కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహ
దిశ, జనగామ: బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారత్ క్యాంపెయినింగ్ లో భాగంగా బాల్ వివాహ్ విముక్తి భారత్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే బాలబాలికలకు వివాహం చేయడం వల్ల వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని, బాల్య వివాహాల నిర్మూలన పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకొని జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బాల్య వివాహ నిర్మూలన జిల్లాగా మార్చాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల పై ఫిర్యాదు చేయడానికి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098లో సంప్రదించాలని కోరారు. అలాగే సమాచారం తెలిపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, సిడబ్ల్యూసీ చైర్ పర్సన్ ఉప్పలయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎల్. రవికాంత్, పీ ఓఐసీ స్వప్నారాణి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ రవి కుమార్, స్కోప్ ఎన్జీవో కో-ఆర్డినేటర్ మనోజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.