వర్ధన్నపేటలో లక్ష మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోంది.. కేఆర్.నాగరాజు
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ సారి లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ అభ్యర్థి కే.ఆర్ నాగరాజు అన్నారు.
దిశ, హన్మకొండ టౌన్ : వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ సారి లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ అభ్యర్థి కే.ఆర్ నాగరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకత ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు స్కీంలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించారని అన్నారు. పార్టీ టికెట్‌ను తనతో పాటు సోదరుడు నమిండ్ల శ్రీనివాస్, సీనియర్ నేతలు సిరిసిల్ల రాజయ్య, పరమ్జ్యోతి ప్రయత్నించారని అన్నారు.
పార్టీ పరంగా అంతా కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా వారిని కలుపుకుని ముందుకు సాగుతామని అన్నారు. శనివారం దిశ మీడియాతో నాగరాజు మాట్లాడారు. తన పై నమ్మకంతో టికెట్ కేటాయింపునకు సహకరించిన జాతీయ అధ్యక్షుడు ఖర్గే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిలకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు.