Commissioner : ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే(Commissioner Ashwini Tanaji Wakade) అన్నారు.

Update: 2024-10-28 11:43 GMT

దిశ, వరంగల్ టౌన్: ప్రజావాణిలో ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే(Commissioner Ashwini Tanaji Wakade) అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి 77 దరఖాస్తులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఫిర్యాదుల వివరాలు ఇంజనీరింగ్ విభాగానికి 16, హెల్త్ అండ్ శానిటేషన్ కు 10, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) కు 07, టౌన్ ప్లానింగ్ విభాగానికి 42, తాగునీటి సరఫరాకు 02, దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, రాజయ్య, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి, హెచ్ ఓ రమేష్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జి సీపీ రవీంద్ర రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, బయాలజిస్టు మాధవ రెడ్డి పాల్గొన్నారు.


Similar News