అనుమతి లేని విత్తనాలపై స్టాఫ్ సేల్ విధించిన ఏవో
పట్టణంలోని అన్నదాత ఎంటర్ ప్రైజెస్ ఫర్టిలైజర్ దుకాణంలో అనుమతిలేని విత్తనాలను అమ్ముతున్నాడని...Cheryala News
దిశ, చేర్యాల: పట్టణంలోని అన్నదాత ఎంటర్ ప్రైజెస్ ఫర్టిలైజర్ దుకాణంలో అనుమతిలేని విత్తనాలను అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారంతో మండల వ్యవసాయ అధికారి ఎండీ ఆఫ్రొజ్ శనివారం తనిఖీలు చేపట్టారు. ప్రొవిజనల్(పీసీ) సర్టిఫికెట్ అనుమతి లేనందున మల్కనిర్ సీడ్స్ వారి ఎంటీయూ 10108, కేఎన్ఎం 118 బస్తాలు, ఆర్ఎన్ఆర్, పయనీర్ కంపెనీకి చెందిన మొక్కజొన్న ప్యాకెట్టు, బ్లోస్డ్ కంపెనీకి చెందిన వరి జల్వా వెరైటీ ప్యాకెట్లు, తనటన్ వెరైటీ ప్యాకెట్లు, సిరి కంపెనీకి చెందిన సిరి 2288 వెరైటీ ప్యాకెట్లను డిసెంబర్ 9 నుంచి 14 రోజుల వరకు విత్తనాలు అమ్మకం నిలిపేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఎండి. అఫ్రోజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆఫ్రోజ్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారి ధ్రువీకరించి పంపించిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. డీలర్లు స్టాక్ రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలన్నారు. తప్పనిసరిగా రైతులకు బిల్లును అందించాలని, ఎక్కువ ధరకు విక్రయించిన చర్యలు తప్పవన్నారు.