కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు ఓటేస్తే తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే : చల్లా ధర్మారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేస్తే మళ్లీ కరెంట్‌ కష్టాలు తప్పవని, ఒకనాడు రైతులు

Update: 2023-11-20 12:52 GMT

దిశ, హనుమకొండ టౌన్ : కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేస్తే మళ్లీ కరెంట్‌ కష్టాలు తప్పవని, ఒకనాడు రైతులు కరెంట్‌ కోసం ఎంతో గోస పడ్డారని, మళ్లీ ఆ కష్టాలు రాకూడదని పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం చౌల్లపల్లి, అగ్రంపాడ్  గ్రామాలల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 3 గంటల కరెంట్‌ ఇచ్చే కాంగ్రెస్‌ కావాలో, 24 గంటల కరెంటిచ్చి రైతులను ఆదుకొనే బీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటేసి 60 ఎండ్లు పడ్డ గోస మళ్లీ పడొద్దని అన్నారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ పచ్చగా మారి ఇక్కడి ప్రజలంతా బాగు పడుతున్న సందర్భాన్ని ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక పోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.


బీఆర్‌ఎస్‌తోనే మరింత అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్‌ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకమని, ప్రజలకు కేసీఆర్‌ పట్ల విశ్వాసముందని, ప్రతి ఒక్క హామీని కూడా కేసీఆర్‌ అమలుచేశారని అన్నారు. ఓట్ల కోసం, ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌,బిజెపి పార్టీలు తీసుకొచ్చిన మ్యానిఫెస్టో ఝూటా మేనిఫెస్టో అని ధ్వజమెత్తారు. ఆ మ్యానిఫెస్టోను నమ్మితే కర్ణాటక ప్రజలకు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ భరోసా లో పొందుపరిచిన హామీలు నెరవేర్చే దమ్ము కేసీఆర్ కి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News