పోలీస్ ఈవెంట్స్‌లో పాల్గొన్న అభ్యర్థి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రనికి చెందిన లింగమల్ల మహేశ్(26) అనే...Candidate who participated in police events died
దిశ, మహముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రనికి చెందిన లింగమల్ల మహేశ్(26) అనే యువకుడు పోలీస్ ఈవెంట్స్ కు వెళ్లి శనివారం మృతిచెందాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గత కొన్ని నెలల నుండి ఈవెంట్స్(రన్నింగ్)లో గెలుపొందాలని హైదరాబాద్ లో శిక్షణ పొందాడు. కాగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600 మీటర్లు పూర్తి చేసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.