తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ...

ఇంటికి తాళం వేసి తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి వచ్చి చూసేసరికి ఇంటిని గుల్ల చేశారు దొంగలు.

Update: 2025-01-03 16:05 GMT

దిశ,గీసుగొండ: ఇంటికి తాళం వేసి తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి వచ్చి చూసేసరికి ఇంటిని గుల్ల చేశారు దొంగలు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... గీసుకొండ మండలం స్టేషన్ చింతలపల్లి గ్రామానికి చెందిన జివ్వాజీ హేమలత వారి కుటుంబ సభ్యులతో కలిసి 30 12 2024 రోజు రాత్రి 8 గంటలకు వారి ఇంటికి తాళం వేసి తిరుపతికి వెంకన్న దర్శనానికి వెళ్లారు. తిరిగి మూడో తారీకు రోజున ఉదయం 5:30 ఇంటికి చేరుకునేసరికి వారి ఇంటి తాళాలు పగలగొట్టి 4.8 తులాల బంగారం,35 తులాల వెండి,30 వేల నగదు మొత్తం సొత్తు విలువ దాదాపు రూ. 3,35,000/-ఉంటుందని, హేమలత సర్టిఫికెట్లు ఉన్న కవర్ను ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని గీసుకొండ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ మహేందర్ తెలిపారు.


Similar News