బావిలో పడి వ్యక్తి మృతి..

వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నెక్కొండ మండలం అప్పారావుపేట గ్రామం మాన్యా తండాలో చోటుచేసుకుంది.

Update: 2025-01-05 10:19 GMT

దిశ,నెక్కొండ: వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నెక్కొండ మండలం అప్పారావుపేట గ్రామం మాన్యా తండాలో చోటుచేసుకుంది.ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బానోతు.పీరు(62 సం"లు) ఆదివారం ఉదయం తెల్లవారుజామున ఇంటి వద్ద నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళాడు.తండాకు సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి మృతి చెందాడు. మృతుని కొడుకు బానోతు.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఒక కుమారుడు,నలుగురు కుమార్తెలు ఉన్నారు.


Similar News