Earth Quake: నేపాల్ లో భారీ భూకంపం.. 53 మంది మృతి
పొరుగుదేశం నేపాల్‌ను భూకంపం (Strong Earth Quake hit Nepal) వణికించింది. మంగళవారం ఉదయం భారీ భూకంపం (Earth Quake) సంభవించడంతో 53 మంది చనిపోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: పొరుగుదేశం నేపాల్‌ను భూకంపం (Strong Earth Quake hit Nepal) వణికించింది. మంగళవారం ఉదయం టిబెట్ లో భారీ భూకంపం (Earth Quake) సంభవించడంతో 53 మంది చనిపోయారు. మరో 62 మంది గాయపడ్డారు. నేపాల్-టిబెట్ (Nepal-Tibet Border) సరిహద్దులో భూమి పలుమార్లు కంపించింది. ఉదయం 6.35 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఉదయం 7.02 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో 4.7 తీవ్రతతో రెండో భూకంపం, 30 కిలోమీటర్ల లోతులో 7.07 గంటలకు 4.9 తీవ్రతతో మూడోసారి భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 9.05 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
భయాందోళనలో ప్రజలు
టిబెట్ లో కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వల్ల ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాట్మండులో సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. అయితే, నేపాల్‌లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్‌లో ఇక్కడ 7.8 తీవ్రతతో భారీగా భూకంపం సంభవించింది. దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఉత్తరాదిలోనూ..
అయితే, ఉత్తరాదిని కూడా భూకంపం వణికించింది. బిహార్ రాజధాని పాట్నా సహా పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. అంతేకాకుండా పొరుగుదేశాలైన చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.