రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2025-01-05 14:57 GMT

దిశ,డోర్నకల్ : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ జె.సురేష్ కథనం ప్రకారం.. గుండ్రాతిమడుగు - డోర్నకల్ రైల్వే స్టేషన్ లో మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుడు(50) ఆధారాలు లభించలేదు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మరింత సమాచారానికి 87126 58600 సంప్రదించాలని కోరారు.


Similar News