AP News:చిట్టీల పేరుతో రూ.78 లక్షలు స్వాహా

చిట్టీల పేరుతో జనాల వద్ద రూ.78 లక్షల నగదు వసూలు చేసి వారిని నట్టేట ముంచిన వారిపై కేసు నమోదు చేశారు.

Update: 2025-01-07 09:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: చిట్టీల పేరుతో జనాల వద్ద రూ.78 లక్షల నగదు వసూలు చేసి వారిని నట్టేట ముంచిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా గుడివాడలో చిట్టీల పేరుతో ప్రజల వద్ద రూ.78 లక్షల నగదు వసూలు చేసి వారిని నట్టేట ముంచారు. ఈ క్రమంలో వారిపై సోమవారం కేసు నమోదు చేశామని గుడివాడ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. పట్టణంలోని నీలామహల్ రోడ్డుకు చెందిన మర్రాపు ప్రియాంక తనకు తెలిసినవారని నల్లమోతు రామ్ గోపాల్ తేజ్, నల్లమోతు ప్రియాంక, నల్లమోతు భవాని వద్ద చిట్టీలు వేసింది. ప్రియాంకతో పాటు మరి కొందరు కూడా వారి వద్ద చిట్టీలు వేశారు. ఈ విధంగా సుమారు రూ.78 లక్షలు వసూలు చేసి తిరిగి చెల్లించక పోగా అడిగితే స్పందించడం లేదు. దీంతో చేసేది లేక బాధితులు పోలీసులను ఆశ్రయించాగా ఆ ముగ్గురి పై కేసు నమోదు చేశారు.


Similar News