విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్...వ్యక్తి మృతి
తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో బైక్పై వస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
దిశ, తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో బైక్పై వస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెం దాడు. వివరాల్లోకి వెళితే... మండేపల్లి గ్రామానికి చెందిన సురకాని మణితేజ తన గ్రామం నుండి తంగళ్లపల్లికి వస్తుండగా రాజప్రపుల్లారెడ్డి ఫంక్షన్ హాల్ వద్దకు చేరు కోగానే.. మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ సంఘటనలో పంట పొలాల్లో ఎగిరిపడిన మణితేజకు తీవ్ర గాయాలై మృతి చెంఆడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అం దించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.