అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి భోజనం చేసి పడుకున్నామని, ఉదయం తాను లేచి చూసే సరికి తన భర్త భాషా మియా( 65) ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడని తెలిపింది. తన భర్త గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఆ భాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య అంకుస్ బి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.