Ed Investigation: కర్నాటి వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్ రికార్డు

కాకినాడ పోర్టు, సెజ్‌కు సంబంధించిన కేసులో కర్నాటి వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు...

Update: 2025-01-08 10:37 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్టు(Kakinada Port), సెజ్‌(Sez)‌కు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు(Enformercement Officers) దూకుడు పెంచారు. పోర్టు యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు(Karnati Venkateswara Rao) ఫిర్యాదు మేరకు విచారణకు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ హయాంలో తన షేర్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Ycp Mp Vijayasai Reddy) బలవంతంగా లాక్కురని సీఐడీ(CID)కి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Mp Yv Subbareddy) తనయుడు విక్రాంత్ రెడ్డి(Vikranth Reddy)పై కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసులోEd Investigation: కర్నాటి వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్ రికార్డు మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు సైతం విచారణ చేపట్టారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించారు.

అయితే కర్నాటి వెంకటేశ్వరరావు ఎవరో తెలియదని, అసలు ఈ కేసుకు తనకు సంబంధం లేదని ఈడీ విచారణలో విజయిసాయిరెడ్డి వెల్లడించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదు దారుడు కర్నాటి వెంకటేశ్వరరావు స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. తన వాటాలు బదిలీ చేయడంలో విజయసాయిరెడ్డి క్రియా శీలకంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో వెంకటేశ్వరరావు స్టేట్ మెంట్ ప్రచారం తదుపరి విచారణపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.

Tags:    

Similar News