Tirumala stampede: తిరుమల తొక్కిసలాటపై స్పందించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలకు కీలక పిలుపు

తిరుమల తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే.

Update: 2025-01-09 04:50 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి(Tirumala Tirupati)లో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో మొత్తం 40 మంది ప్రజలకు తీవ్ర గాయాలు కాగా అందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన పై పార్లమెంట్ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ(MP Rahul Gandhi) స్పందించారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌లో ఆయన ఇలా రాసుకొచ్చారు. "తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి(Heartfelt sympathy). గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరుతున్నానని కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

తిరుమల తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్ల దగ్గర బుధవారం రాత్రి 8 గంటల తర్వాత తొక్కిసలాట(Stampede) జరింది. ఇందులో ఆరుగురు మృతి చెందారు. అలాగే 40 మందికి గాయాలు కాగా వారిని తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే స్వల్ప గాయాలతో బయటపడినవారు ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నారు.. తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు రుయాలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించనున్నారు.


Similar News