Cyber Frauds : వామ్మో..! రూ.వెయ్యి పెట్టుబడికి చిటికెలో రూ.లక్ష రాబడా!?
సెబర్ మోసాలు..నేరాలు(Cyber Frauds Crimes)పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న టీజీ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికార వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ఎక్స్ వేదికగా మరోసారి ఆన్ లైన్ మోసాలపై తీరుపై హెచ్చరికలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : సెబర్ మోసాలు..నేరాలు(Cyber Frauds Crimes)పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న టీజీ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికార వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ఎక్స్ వేదికగా మరోసారి ఆన్ లైన్ మోసాలపై తీరుపై హెచ్చరికలు చేశారు. వామ్మో..! రూ.వెయ్యి పెట్టుబడి(Thousand Investment)కి చిటికెలో రూ.లక్ష రాబడా(One lakh Revenue)!? అంటే 99 రెట్లు లాభమా?! ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా అసలు అంటూ సంబంధిత వీడియోను పోస్టు చేశారు.
వీడియోలో ఇలా నోట్ల కట్టలు చూపించగానే నిజమే అనుకుని అత్యాశకు పోకండని.. సోషల్ మీడియాలో మీ కంట పడే ఇలాంటి మాయగాళ్ల మాటలు నమ్మి ఏరి కోరి ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడకండని.. జీవితాలను చిద్రం చేసుకోకండని హెచ్చరించారు. ఆశ ఉండొచ్చు తప్పులేదని..అత్యాశ, దురాశ ఉంటే మీకు చివరికి బాధ, దుఃఖమే మిగులుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండని హితవు పలికారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండటం ఉత్తమమన్నారు. నోట్ల కట్టలతో అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగాళ్ల గురించి మీకు సమాచారం ఉంటే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయండని సూచించారు.