KTR: కేటీఆ‌ర్‌కు బిగ్ షాక్.. ఏసీబీకి అందిన మరో ఫిర్యాదు

ఫార్ములా ఈ-రేసు కేసులో ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.

Update: 2025-01-08 07:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race Case) కేసులో ఇప్పటికే పీకల్లోతూ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై ఏసీబీ (ACB)కి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్ల (ORR Tenders)లో భారీగా అవకతవకలు జరిగాయని.. వెంటనే ఆ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ.. బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ (Yugandhar Goud) ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. అదేవిధంగా ఓఆర్ఆర్ టోల్ లీజ్‌ టెండర్లలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపిస్తూ.. కేటీఆర్‌తో పాటు మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా యుగంధర్ గౌడ్ ఈడీకి ఫిర్యాదు చేశారు.

కాగా, హైదరాబాద్‌ నెహ్రూ ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) (Hyderabad Nehru Outer Ring Road) నిర్వహణను 30 ఏళ్ల కాలానికి కేవలం 7,380కోట్లకే లీజుకు ఇచ్చిన వ్యవహారం అప్పట్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రాథమిక అంచనా రాయుతీ విలువ ఐఈసీవీ (Initial Estimated Concession Value is IECV) ఎంత అనేది వెల్లడించకుండా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏ (HMDA)లు కలిసి ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ (IRB GOLKONDA EXPRESS LTD) కంపెనీతో ఒప్పందాలు చేసుకోవడం అక్రమమని అప్పట్లో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం‌ (BRS Government)పై దుమ్మెతిపోశాయి. 158 కి.మీ ఓఆర్‌ఆర్‌ (ORR)ను టీవోటీ (Toll Operate Transfer) పద్ధతిలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగానికి, పబ్లిక్‌ ట్రస్ట్‌ సూత్రానికి పూర్తిగా విరుద్ధమని పలువురు నేతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాజాగా, యుగంధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఓఆర్ఆర్ లీజు వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది.

Tags:    

Similar News