TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన
వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) కీలక ప్రకటన చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియతో మాట్లాడుతూ.. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తామని తెలిపారు. గురువారం తిరుపతి (Tirupati), తిరుమల (Tirumala)లో ఏర్పాటు చేసిన 91 కౌంటర్లలో 1.2 లక్షల దర్శన టోకెన్లను భక్తులకు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. 10 రోజులు పాటు సిఫార్సు లేఖ.. ప్రధానాలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని బీఆర్ నాయుడు తెలిపారు.