రేపు హన్మకొండకు మంత్రులు పొంగులేటి, పొన్నం రాక
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర అటవీ, పర్యావరణం
దిశ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర అటవీ, పర్యావరణం, ఎండోమెంట్స్ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సోమవారం హన్మకొండ జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రీజియన్ పరిధిలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు సోమవారం ప్రారంభించనున్నారు. అనంతరం అశోక హోటల్ జంక్షన్ రోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ట్రాఫిక్ పై పిల్లలకు అవగాహన కల్పించే పార్కుకు మంత్రులు శంకు స్థాపన చేయనున్నారు.