జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి : ఎమ్మెల్యే

క్రీడలు జీవితంలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఏబీవీపీ చిట్యాల యూనిట్ ఆధ్వర్యంలో,

Update: 2025-01-07 09:33 GMT

దిశ, చిట్యాల : క్రీడలు జీవితంలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఏబీవీపీ చిట్యాల యూనిట్ ఆధ్వర్యంలో, స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఖేల్ ఉత్సవ్ నాలుగు మండలాల జోనల్ స్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ అని తెలియజేశారు. ప్రథమ బహుమతి పొందే విధంగా కృషి చేయాలని, ఓటమిని చెందినవారు నిరుత్సాహపడకుండా చాలెంజిగా తీసుకోవాలన్నారు. మంచి క్రీడాకారులుగా, విద్యావంతులుగా, మీ గోల్స్ ను రీచ్ అయ్యే విధంగా ఎదగాలన్నారు. మీ మీద ఉంచిన తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను ఊహించుకొని చదవాలన్నారు.

క్రీడాకారులకు జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ క్రీడా దుస్తులను ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు స్పాన్సర్ చేశారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి, దీనికి సహకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా నిర్వహణ కమిటీ రాజ్ కుమార్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు రోజుల్లో నా సహకారం ఉంటుందని, మండుటెండలను లెక్క చేయకుండా ఆటల పట్ల మీకున్న మక్కువ కు అభినందనలు తెలియజేశారు. మండలంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, రఘు, మండల అధ్యక్ష కార్యదర్శులు గూట్ల తిరుపతి, గడ్డం కొమురయ్య, వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, ఆరేపల్లి మల్లయ్య, జిల్లా నాయకులు రాయ కొమురు, టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు కుమార్, మొగిలి, రెబల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News