మాన‌వత్వాన్ని చాటుకున్న త‌హ‌సీల్దార్ విక్ర‌మ్‌కుమార్‌

భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డం, ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓ మ‌హిళా ఉద్యోగినికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత‌

Update: 2025-01-05 16:12 GMT

దిశ‌, హ‌న్మ‌కొండ : భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డం, ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓ మ‌హిళా ఉద్యోగినికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత‌, హ‌న్మ‌కొండ జిల్లా ఐన‌వోలు త‌హ‌సీల్దార్ ఆర్థిక సాయం అంద‌జేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో గతంలో వీఆర్వోగా ప‌నిచేసిన వెంకటమ్మ కొన్ని నెల‌ల కింద‌ట జీసీసీకి బదిలీ అయ్యింది. ఈ క్ర‌మంలోనే భ‌ర్త తీవ్ర అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. జీసీసీలో కొన్ని నెల‌లుగా జీతాలు రాక‌పోవ‌డంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గ‌తంలో పిన‌పాక త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేసిన విక్ర‌మ్‌కుమార్ విష‌యం తెలియ‌డంతో ఆదివారం రెవెన్యూ సిబ్బందితో క‌లిసి వెంక‌ట‌మ్మ‌కు ఇంటికి వెళ్లి రూ.15000 ఆర్థిక సాయం అంద‌జేశారు. వెంక‌ట‌మ్మ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాల‌ని రెవెన్యూ ఉద్యోగుల‌కు, దాత‌ల‌కు విక్ర‌మ్‌కుమార్ పిలుపునిచ్చారు. వెంక‌ట‌మ్మకు ఆర్థిక సాయం అంద‌చేయాల‌నుకునే వారు..ఫోన్ పే 8367547030(వైష్ణవి)లో సంప్ర‌దించాల‌ని తెలిపారు.


Similar News