భూపాలపల్లి జిల్లా వైద్య సేవలకు నిలయం : ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దినదిననాభివృద్ధి చెందుతూ జిల్లాగా ఏర్పడి నేడు భూపాల్ పల్లి జిల్లావైద్య సేవలకు నిలయంగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
దిశ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దినదిననాభివృద్ధి చెందుతూ జిల్లాగా ఏర్పడి నేడు భూపాల్ పల్లి జిల్లావైద్య సేవలకు నిలయంగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాల్ పల్లి జిల్లాలో వంద పడకల ఏరియా హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్ వచ్చిందని, భూపాల్ పల్లిలో మెడికల్ కళాశాల రావడం వల్ల విద్యార్థులకు వైద్యవిద్యలు సీట్ల సంఖ్య పెరిగి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే వైద్యవిద్యను అభ్యసించే అవకాశం వచ్చిందని అన్నారు.
గతంలో భూపాల్ పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా 50 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ముందుగా 30 కోట్లు ఇచ్చారు. మిగిలిన 20 కోట్లు మంజూరు చేయగా త్వరలోనే వాటికి టెండర్లు పిలిచి పనులు పూర్తిచేస్తామని తెలిపారు.