క్వారీ గుంతలో పడి యువకుడు మృతి..
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, అమ్మాపురంలో గురువారం
దిశ,తొర్రూర్ : మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, అమ్మాపురంలో గురువారం ఘోర ఘటన చోటుచేసుకుంది. తవ్వకాలు జరిపి వదిలేసిన క్వారీ గుంతలో కడెం హరీష్ (17) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అమ్మాపురానికి చెందిన కడెం రాజాలు-సునీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరీష్ చిన్న కుమారుడు. అతను తొర్రూరు లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.స్కాలర్షిప్ కోసం బుధవారం గ్రామానికి వచ్చిన హరీష్ మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు.సుమారు 3 గంటల సమయంలో,తల్లి సునీత బట్టలు మిషన్ వద్ద వేసి రావాలని చెప్పింది.
మిషన్ వద్ద కరెంటు లేకపోవడంతో, అరగంట తర్వాత రమ్మని సూచించగా,ఈ క్రమంలో హరీష్ సమీపంలో ఉన్న తవ్వకాలు జరిపి వదిలేసిన క్వారీ వద్దకు బాహ్య విసర్జనకు వెళ్లి ఉంటాడని అతని సోదరుడు ఘనశ్యామ్ తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచి హరీష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గురువారం ఉదయం పోలీసులకు సమాచారం అందించాగా..ఎస్సై జి. ఉపేందర్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం,ఫైర్ సిబ్బంది క్వారీ గుంతలో శ్రమించారు. అయితే సాయంత్రం వరకు హరీష్ ఆచూకీ లభ్యం కాలేదు. కానీ 24 గంటల తర్వాత రాజేష్ మృతదేహం వారి గుంతలో పైకి తేలడంతో సానికులు గుర్తించారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తొర్రురు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కడెం హరీష్ ప్రమాదవశాత్తు గ్రామంలోని క్వారీలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘటన స్థలానికి చేరుకుని హరీష్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్వారీ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.