భూవివాదంలో ఒకరి హత్య.. మరొకరికి తీవ్ర గాయాలు
సాగు చేసుకుంటున్న భూమిపై రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదం
దిశ, కాటారం : సాగు చేసుకుంటున్న భూమిపై రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఒకరి ప్రాణాలు బలికొన్నది. పొలం దగ్గర జరిగిన కొట్లాటలో ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భూవివాదంలో శుక్రవారం దొంగిరి బుచ్చయ్య రైతును ఇదే గ్రామానికి చెందిన సోదారి పవన్ కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మరణించారు. పొలం దగ్గర జరిగిన కొట్లాటలో మృతిచెందిన దొంగిలి బుచ్చయ్య సోదరి పద్మను పాలతో కొట్టడంతో తీవ్ర గాయాలపాలైనట్టు బంధువులు తెలిపారు. సంఘటన జరిగిన పొలాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగార్జున రావు సందర్శించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన దొంగిరి బుచ్చయ్య శుక్రవారం వివాదంగా ఉన్న సోదారి లింగయ్య భూమి దగ్గరికి వెళ్లారు. లింగయ్య, భార్య పద్మ , బుచ్చయ్య గొడవపడ్డారు. బుచ్చయ్య పారతో కొట్టడంతో తీవ్ర గాయాల పాలయింది. ఈ విషయాన్ని సోదారి లింగయ్య తన కుమారుడు సుదారి పవన్ కు చెప్పారు. తల్లి గాయపడిన విషయాన్ని తెలుసుకున్న పవన్ ఇంటికి వస్తున్న గా మార్గమధ్యంలో కాటారంలోని పశువుల ఆసుపత్రి మందు దొంగిరి బుచ్చయ్య కనబడ్డాడు. పవన్ వెంటనే అక్కడే ఉన్న కర్ర తీసుకుని బుచ్చయ్య తలపై కొట్టగా కింద పడి అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. సోదారి లింగయ్య దొంగిరి బుచ్చయ్యలు భూమి సాగు చేసుకుంటుండగా కొన్నేళ్లుగా వివాదం ఉందని, ఎవరికి భూమిపై తగిన రికార్డులు లేవని, గతంలో ఘర్షణ పడగా కేసులు నమోదు చేసినట్లు సీఐ నాగార్జున రావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.