తుపాకీతో తిరుగుతున్న వ్యక్తుల అరెస్టు..
ఒక తుపాకితో తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ ఆర్ కె ఖాన్ వెల్లడించారు.
దిశ, మహబూబాబాద్ టౌన్ : ఒక తుపాకితో తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ ఆర్ కె ఖాన్ వెల్లడించారు. 2020 వ సంవత్సరంలో ఒక గంజాయి కేసులో మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన అందం గోపి, రాజస్థాన్ కి చెందిన ప్రవీణ్ భారతి లు రాజమండ్రి జైలుకు వెళ్లగా అక్కడ వీరికి దేవళకు చెందిన బయరాం, ఒడిస్సాకు చెందిన చంద్రశేఖర్లు పరిచయం అయ్యారు. ఒడిస్సా కు చెందిన చంద్రశేఖర్ తో జయరాం తనకు బిజినెస్ పరంగా ఒక తుపాకీ కావాలని అడగగా చంద్రశేఖర్ అందెం గోపిని అడిగి, గోపి రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ భారతికి చెప్పగా, అతడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ వద్ద గోపికి ఒక తుపాకి తూటాలు ఇప్పించాడు. తర్వాత చంద్రశేఖర్ ఈ తుపాకీ వద్దని చెప్పగా దానిని అమ్మడానికి వారు తమ వద్ద ఉన్న కారు టీజీ 25 టీ 0335 లో తుపాకిని పెట్టుకుని తిరుగుతున్నారు. కేసముద్రం పోలీసులకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు, కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక కారును ఆపి చెక్ చేసి వారి వద్ద నుండి ఒక తుపాకీ, రెండు తూటాలు, 5 వ్యక్తులను పోలీస్ పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఇమ్రాన్ ఖాన్, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.