అడవి జంతువులను హతమార్చిన నిందితుల అరెస్ట్…

ములుగు ఫారెస్ట్ రేంజ్ లో అడవి జంతువులను వేటాడి హతమార్చిన ఆరుగురు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.

Update: 2024-10-08 08:44 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు ఫారెస్ట్ రేంజ్ లో అడవి జంతువులను వేటాడి హతమార్చిన ఆరుగురు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం జాకారం గ్రామ సమీపంలో అడవి పందిని, అడవి పిల్లిని హతమార్చి ఆటోలో తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు జాకారం గ్రామ సమీపంలో ఫారెస్ట్ అధికారులు తనిఖీ చేయగా ఒక ప్యాసింజర్ ఆటో లో చనిపోయి కాల్చిన అడవి పంది, అడవి పిల్లిని గుర్తించి తరలిస్తున్న 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చరున్నట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి వన్యప్రాణులను వేటాడిన కత్తులను, చనిపోయిన పంది, అడవి పిల్లి లను స్వాధీనం చేసుకున్నారు.


Similar News