వాడవాడంతా.. ఓ పూల వనమాయే అంటూ అమెరికాలో బతుకమ్మ సంబరాలు...

అమెరికాలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇటివల కాలంలో భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకుంటున్నారు.

Update: 2024-10-07 09:27 GMT

దిశ, జనగామ: అమెరికాలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇటివల కాలంలో భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకుంటున్నారు. జనగామ కి చెందిన తెలుకుంట ప్రణీత ప్రతి సంవత్సరం అంగరంగవైభవంగా ఎంతో సృజనాత్మకతను జోడించి వైవిద్యమైన బతుకమ్మను చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. ఈ సారి కూడా అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హిందూ టెంపుల్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియానాపాలిస్ వారు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఆ ప్రాంతంలో స్థిరపడిన తెలుగు వారు అందరూ పాల్గొని తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.


Similar News