భారీగా నల్లబెల్లం తరలిస్తున్న వ్యాన్ సీజ్.. నలుగురిపై కేసు నమోదు..
వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ శివారులో నాటుసారాయి కేంద్రాలపై దాడులు నిర్వహించగా ఒక గూడ్స్ వాహనంలో నల్ల బెల్లం, నాటు సారాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని గూడూరు ఎక్సైజ్ సీఐ బిక్షపతి అన్నారు.
దిశ, గూడూరు: వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ శివారులో నాటుసారాయి కేంద్రాలపై దాడులు నిర్వహించగా ఒక గూడ్స్ వాహనంలో నల్ల బెల్లం, నాటు సారాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని గూడూరు ఎక్సైజ్ సీఐ బిక్షపతి అన్నారు. ఈ దాడులలో 80 బస్తాల నల్లబెల్లం, 4 బస్తాల పట్టిక సుమారు 50 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని సుమారు 400 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేయడం జరిగింది.
ఈ దాడుల్లో వాహనాన్ని స్వాధీనం చేసుకొని మహబుబాద్ జిల్లాకు చెందిన భూక్యా భావ్ సింగ్, ఏర్రగండ్ల పల్లె, నల్గొండ జిల్లాకు చెందిన అంజయ్య, హైదరాబాద్ కు చెందిన వ్యాన్ డ్రైవర్ సుల్తాన్, క్లీనర్ మున్నీర్ లపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ దాడుల్లో గూడూరు ఎస్ఐ జయశ్రీ, హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, కానిస్టేబుళ్లు సుధాకర్, వెంకన్న, నరేష్, యుగేందర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.