బతుకమ్మ పండుగలో అపశృతి.. ఒకరు మృతి

సద్దుల బతుకమ్మ పండుగ వేళ అపశృతి చోటు చేసుకుంది

Update: 2024-10-11 05:58 GMT

దిశ, నెక్కొండ: సద్దుల బతుకమ్మ పండుగ వేళ అపశృతి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామానికి చెందిన చీకటి యాకయ్య(40) గ్రామంలో జరిగే బతుకమ్మ వేడుకలకు తన మనవడితో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అటుగా కారు వస్తుండగా పక్కకు జరిగేందుకు ప్రయత్నించాడు.అప్పటికే గ్రామంలో వర్షం పడి ఉండటంతో నీరు నిలిచిఉంది. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న డెకరేషన్ లైటింగ్ వైర్లను పట్టుకున్నాడు. దీంతో కరెంట్ తీగలు తాకడంతో షాక్ గురైయ్యాడు. తక్షణమే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో అతని చేతిలో ఉన్న అతని మనవడు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతునికి భార్య లత, కుమార్తెలు స్నేహ, రుచిత ఉన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితమే పెద్ద కూతురు వివాహం చేశారు. పండుగ వేళ అపశృతి చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News